March 22, 2026
Explore
ఈతకెళ్లి బాలుడి మృతి

ఈతకెళ్లి బాలుడి మృతి

March 22, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్ (13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags: Boy Drowns While Swimming