పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని హనుమంతరాయునిదిన్ని గ్రామంలో వెలసిన శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం గ్రామస్తులు పోస్టర్లు విడుదల చేశారు. వార్షికబ్రహ్గ్మత్సవాలలో భాగంగా 25న ఉదయం అభిషేకం, 26న ధ్వజారోహణము, 27న కళ్యాణోత్సవం, 28న రథోత్సవం, 29న దోపోత్సవం, 30న వసంతోత్సవం, 31న సుప్రభాతసేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.
Tags: Sri Veeranjaneya Swamy’s Annual Brahmotsavams Begin on the 25th