March 21, 2026
Explore
ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నిందితులు అరెస్టు

ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఏడుగురు నిందితులు అరెస్టు

March 21, 2026 | Andhra Pradesh

ఖమ్మం ముచ్చట్లు:

11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం..

వివరాలు వెల్లడించిన టౌన్ ఏసిపి రమణమూర్తి

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన నిందుతులను ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు ఆధ్వర్యంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం…

ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులకు శుక్రవారం వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఖమ్మం,మహబూబాబాద్, సూర్యాపేట ప్రాంతాలలో గత కొన్ని నెలలుగా మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, నిందుతుల నుండి పలు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళను తక్కువ ధరలకు మెకానిక్స్, ఇతర వ్యక్తులకు అమ్ముతూ వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని, పోలీసులు నిందితుల నుండి దొంగిలించిన (17) వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు రిసీవర్లను గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

అరెస్ట్ అయిన నిందితులు:

  1. కొండమీద యోగీశ్వర్ @ యోగీ 19 సం, స్టూడెంట్ మామిళ్ళగూడెం, ఖమ్మం
  2. మేడ సాయి కుమార్ 27 సంలు, కమాన్ బజార్, ఖమ్మం
  3. మరో నలుగురు మైనర్లు.

రిసీవర్లు:

  1. ముద్దంగుల నరేష్, 28yrs, తీగల బంజర, కొనిజెర్ల, ఖమ్మం. (అరెస్ట్)
  2. షేక్ హరీఫ్, 28yrs, తీగల బంజర, కొనిజెర్ల, ఖమ్మం. (పరారీ లో ఉన్నాడు)
  3. నునావత్ వినోద్, 30yrs, తీగల బంజర, కొనిజెర్ల, ఖమ్మం. (పరారీ లో ఉన్నాడు)

Tags:Seven Accused Arrested in Two-Wheeler Theft Cases