అమరావతిముచ్చట్లు:
దేశంలో ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఒక ఇంటికి ఒకే కనెక్షన్’ నిబంధనను కఠినతరం చేసింది. ఇప్పటికే పీఎన్జీ సౌకర్యం ఉన్నవారు ఎల్పీజీని వదులుకోవాలని కోరిన ప్రభుత్వం, జూన్ 1 నుంచి ఆ నిబంధనను అమలు చేయనుంది. ఈ గడువు ముగియగానే పీఎన్జీ ఉన్నవారి ఎల్పీజీ కనెక్షన్లు ఆటోమేటిక్ గా రద్దవుతాయి. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే డేటాబేస్ ను అనుసంధానించాయి, కాబట్టి వీరు ఇకపై సిలిండర్ రీఫిల్లింగ్కు బుక్ చేసుకోలేరు.
Tags: Their cylinder connections will be cut starting the day after tomorrow!