March 21, 2026
Explore
అమేజాన్ లో ఉద్యోగం.. దొంగలా మారి దొరికిపోయాడు..!

అమేజాన్ లో ఉద్యోగం.. దొంగలా మారి దొరికిపోయాడు..!

March 21, 2026 | Andhra Pradesh

ఎల్బీనగర్ ముచ్చట్లు:

ఓ ఇంట్లోకి ఏసీ మెకానిక్ అని చెప్పి చొరబడ్డాడు…!

ఒంటరిగా ఉన్న మహిళపై సుత్తితో దాడి చేసి గాయ పరిచాడు..!

ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తేలతాడు ఎత్తుకుని ఉడాయించాడు…

దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ హాస్పిటల్ లో చేరింది..

ఘటనను తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా రెండు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు…

అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..!

రంజాన్ పండుగ వేళ చోరీ చేసి దాడి చేసి కటకటాల పాలు కావలసి వచ్చింది ఓ యువకుడి పరిస్థితి..!
•••••••

  • ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్ హిల్స్ కాలనీ లో ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు..!
  • నిందితుణ్ణి గంటల్లో పట్టుకున్న పోలీసులు
  • ఏసీ మెకానిక్‌గా పరిచయం చేసుకొని మహిళను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు..!
  • ఇంట్లో మహిళ ఒక్కతే ఉందని నిర్ధారించుకుని ఆమెపై సుత్తితో దాడి..!
  • పుస్తేలతాడు తెంచుకుని పరారీ..!
  • స్థానికులు 100కి డయాల్ చేయగా ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు..
  • భాధితురాలి ని చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రి కి తరలించిన పోలీసులు..
  • చికిత్స పొందుతున్న భాధితురాలు..!
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తించి.. గాలింపు చేపట్టిన పోలీసులు..!
  • ఎట్టకేలకు రెండు గంటల లోపే నిందితుడిని పట్టుకున్న పోలీసులు..!
  • నిందితుడు అబ్రార్ అహ్మద్ అని గుర్తింపు..!
  • నిందితుడు Amazon లో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పిన పోలీసులు..!

దర్యాప్తు చేస్తున్న ఎల్బీనగర్ పోలీసులు..!

Tags:A Job at Amazon… Turns Thief and Gets Caught!