March 20, 2026
Explore
దేశంలోనే తొలి ‘ఆల్-ఉమెన్’ రైల్వే స్టేషన్.. ఎక్కడంటే..?

దేశంలోనే తొలి ‘ఆల్-ఉమెన్’ రైల్వే స్టేషన్.. ఎక్కడంటే..?

March 20, 2026 | Andhra Pradesh

ముంబై ముచ్చట్లు:

ముంబైలోని మాటుంగా రైల్వే స్టేషన్ దేశంలోనే తొలి ‘ఆల్-ఉమెన్’ స్టేషన్గా అరుదైన రికార్డు సృష్టించింది. ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుండి పాయింట్మెన్ వరకు మొత్తం 41 మంది సిబ్బంది మహిళలే కావడం విశేషం. మహిళా సాధికారతకు చిహ్నంగా 2017లో ప్రారంభమైన ఈ ప్రయోగాన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2018లో చోటు కల్పించారు. రైల్వే విధులను సైతం మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరని మాటుంగా రైల్వే స్టేషన్ నిరూపిస్తోంది.

Tags: The Country’s First ‘All-Women’ Railway Station… Where Is It?